Site icon PRASHNA AYUDHAM

మెరుగైన వైద్యం అందించి మొదటి కేసు విజయవంతం 

IMG 20251008 WA0192

మెరుగైన వైద్యం అందించి మొదటి కేసు విజయవంతం

 

యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 8

 

అతి తక్కువ ఖర్చుతో బాధ లేకుండా వ్యాధిని నయం చేయడం జరిగిందని కామారెడ్డికి సంబంధించిన మొదటి కేసులో విజయం సాధించినట్లు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. బుధవారం రోజున కామరెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన సుమలత ఉపాధ్యాయిని రక్తనాళాల వ్యాధితో నడుము నొప్పి వ్యాధి ఎంతకు నయం కాకపోవడంతో తమ ఆసుపత్రికి రాగా ఆ వ్యాధిని గుర్తించి మెరుగైన వైద్యం అందించి కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆమె విధులు నిర్వహించుకునేలా వైద్యం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా రక్తనాళాల్లో చీలిక ఏర్పడినప్పుడు భరించలేని నడిమినొప్పి వస్తుందని దీనిని మొదట్లోనే గుర్తిస్తే పెద్దగా ఖర్చు లేకుండానే మందుల ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చని, ఈ సమస్య ఉన్న రోగి వ్యాధిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. గత 20 సంవత్సరాలుగా బెంగళూరులో వైద్య సేవలు చేయడం జరిగిందని ఆరు నెలలుగా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఈ వ్యాధి గ్రస్తులు ఎక్కువ సమయం నిలబడిన, కూర్చున్న వారికి ఈ వెన్నుపూస వ్యాధి రావడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధిని మొదట్లో గుర్తించి వైద్యం చేయించుకొని ఎడల పెండరక్తకణాలలో ఏర్పడిన శీలిక శరీరమంతుల వ్యాపించి కాళ్లు పడిపోయి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా కాళ్లకు నల్లటి మచ్చలు పుండ్లు అవుతాయన్నారు. ప్రతి నెల కామారెడ్డి పట్టణంలో రెండవ బుధవారం రోజున డాక్టర్ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

వైద్యం చేసిన తర్వాత సుమలత మాట్లాడుతూ  తనకు వైద్య సేవలందించిన డాక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version