రాజంపేట మండలంలో నామినేషన్ తొలి విడత పూర్తి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 3
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తొలి విడత బుధవారం పూర్తయ్యింది. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డ్ సభ్యుల స్థానాలకు 14 వార్డులు ఉన్నాయి ఇందులో చాలామంది పోటీదారులు ఉన్నారు . ఇదివరకు చర్చల నేపథ్యంలో 5వ వార్డ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. నామినేషన్ల పరిశీలన, తదుపరి అంసాలపై ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు.