రాష్ట్రంలోనే మొదటి స్థానం కామారెడ్డి రోడ్ రవాణా శాఖ 

రాష్ట్రంలోనే మొదటి స్థానం కామారెడ్డి రోడ్ రవాణా శాఖ

— కమర్షియల్ వాహనదారులు క్రమం తప్పకుండా ట్యాక్స్ లు చెల్లించుకోవాలి

— కామారెడ్డి రోడ్డు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం వివిధ పన్నుల వసూళ్ళలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కు 92.4 శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుందని కామారెడ్డి రోడ్డు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పన్నుల రూపంలో గత 2023 – 2024 సంవత్సరం లో 63 కోట్లు వసూలు చేయగా దానికి 16 శాతం జోడించి ప్రభుత్వం ఈ సంవత్సరం 73 కోట్ల టార్గెట్ ను విధించిందని అందులో 24 – 25 సంవత్సరానికి గాను 68 కోట్ల 19 లక్షల రూపాయల పన్నులు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5.03 శాతం ఎక్కువగా పన్నులు వసూలు చేశామన్నారు. ఈ సంవత్సరంలో వసూలు చేసిన వివరాలను ఆయన వివరిస్తూ క్వాటర్ టెక్స్ లో 9 కోట్ల 88 లక్షల 55,000 వసూలు చేశామని, లైఫ్ టాక్స్ లో 38 కోట్ల 34 లక్షల 34 వేల రూపాయలను వసూలు చేయడం జరిగిందన్నారు. ఫీజుల రూపంలో ఏడు కోట్ల 35 లక్షల 47,000, సర్వీస్ చార్జీల రూపంలో రెండు కోట్ల పదారు లక్షల89,000, గ్రీన్ టాక్స్ రూపంలో 79 లక్షల 83000, ఇన్ఫోసిమెంట్ ఆధ్వర్యంలో 9 కోట్ల 63 లక్షల 91 వేల రూపాయలను వసూలు చేయడం జరిగిందన్నారు. వీటన్నిటికీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల సహకారంతో తాము పన్నులను వసూలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ పన్నుల వసుఊళ్ళలో ప్రజాప్రతినిధుల సహకారం సైతం ఉందన్నారు. కమర్షియల్ వాహనాదారులు మూడు నెలలకు ఓసారి చెల్లించే టాక్స్ క్రమం తప్పకుండా చెల్లించేందుకు ప్రజాప్రతినిధుల పాత్ర చాలా ఉందన్నారు. కమర్షియల్ వాహనదారులు తమ వాహనాలను వాడనట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలని తద్వారా ఆ వాహనానికి ఆ మూడు నెలల పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే హెల్మెట్ లేని వాహనదారులకు 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తద్వారా రోడ్డు ప్రమాదాలలొ మరణాలను తగ్గించేందుకే తమ ప్రయత్నమని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. హెల్మెట్ లేకపోతే బండి సీజ్ చేయడం లేదా 5 వేల రూపాయల జరమానా విధించడం జరుగుతుందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment