సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

*పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 13( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

గుమ్మలక్ష్మీపురం మండలంలో చెముడుగూడ, అడ్డంగూడ, తాటిశీల, గ్రామాల్లో ఆదివారం నాడు మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. ముందుగా టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పడితే చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పింఛను రూ.4000 వేలకు పెంచారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం, మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కూడా అందజేస్తాం అని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ కడ్రక కళావతి, మాజీ సర్పంచ్ రామారావు, కొండలరావు, భాస్కర్ రావు, సదానంద్, రవి, శ్రీను, ఈశ్వర్, మంగయ్య, ప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now