మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మండల కేంద్రమైన కౌడిపల్లి లోని డీసీఎంఎస్ (మహదేవ్ ట్రేడర్స్) ఎరువుల షాపు యజమాని జై గౌడ్ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా జై గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధితో పాటు యువత ముందుండి దేశం కోసం పని చేస్తుందని అన్నారు. భారత పౌరునిగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగర వేయాలని అప్పుడే గౌరవం దక్కుతుందన్నారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు.
ఎరువుల షాపు వద్ద జెండా ఆవిష్కరణ
Oplus_131072