తాడ్వాయి మండలంలో ముదిరాజ్ సంఘం నందు జెండా ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా తాడ్వాయి, (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షుడు పని పోచయ్య, చేత పతాకావిష్కరణ జరగగా, ఉపాధ్యక్షుడు పంబల్ల నర్సింలు, మాజీ అధ్యక్షుడు పంబల్ల సతీష్, కాష్యర్ పంబల్ల పండరి, సెక్రటరీ పని పవన్, దామోదర్, పంబల్ల సదాశివుడు, గంగారం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.