Site icon PRASHNA AYUDHAM

పప్పులతో పులకరించిన మువ్వన్నెల జెండా!

IMG 20250814 WA0280

🇮🇳 పప్పులతో పులకరించిన మువ్వన్నెల జెండా!

గజ్వేల్ కళాకారుడు రామకోటి రామరాజు వినూత్న సృజన

10 అడుగుల పొడవైన పప్పుల మువ్వన్నెల జెండా ఆవిష్కరణ

కాషాయంకు ఎర్రపప్పు, తెలుపుకు బియ్యం, ఆకుపచ్చకు పెసరపప్పు వినియోగం

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి ప్రతిబింబం

“ఎ తల్లి నినుకన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పది” – రామరాజు

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్..(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 14

స్వాతంత్ర్య దినోత్సవం ఆవేశం, కళామాధుర్యం కలిసొచ్చినప్పుడు దేశభక్తి అద్భుత రూపం దాలుస్తుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న–కళారత్న–సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 అడుగుల పొడవైన మువ్వన్నెల జెండాను 3 రకాల పప్పులతో అలంకరించారు.కాషాయానికి ఎర్రపప్పు, తెలుపుకు బియ్యం, ఆకుపచ్చకు పెసరపప్పు ఉపయోగించి ఈ జెండాను గురువారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. “భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన భారతదేశం. ఎ తల్లి నినుకన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పది” అని భావోద్వేగంగా రామరాజు పేర్కొన్నారు. ప్రతి ఏడాది కొత్త ఆలోచనతో తల్లి భూమి చిత్రాన్ని రూపొందించడం తన అదృష్టమని, ఇది తల్లి ఋణం తీర్చుకునే మార్గమని అన్నారు.దేశభక్తిని పప్పుల రూపంలో ప్రతిబింబించిన ఈ సృజన స్థానికుల ప్రశంసలు అందుకుంది.

Exit mobile version