*మాజీ కౌన్సిలర్ కు ఘనంగా సన్మానం*
*మాజీ కౌన్సిలర్ ని తెలంగాణ టైగర్స్ యువజన సంఘం ఘన సన్మానం*
*మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 6
ఆదివారం రోజున కామారెడ్డి మున్సిపల్ అరవ వార్డు, మాజీ కౌన్సిలర్ ఆకుల రూప, రవికుమార్, ని సరంపల్లి లో వారి నివాసంలో తెలంగాణ టైగర్స్ యువజన సంఘం, వారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఐదు సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనే భేదం లేకుండా, ఎవరు వచ్చినా ప్రతి ఒక్క వారికి తేడా లేకుండా పని చేసి పెట్టినాడు. ప్రజలతో మంచిగా అందరితో కలిసి మెలిసి, ఉండి వార్డులకు ఏ ప్రాబ్లం వచ్చిన అందర్నీ పిలుచుకొని, అందరితో మాట్లాడి అందరి కోరికు మేరకు ప్రాబ్లం సాలో చేసినారు. ఐదు సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించినారు. వారు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. వారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు అని తెలంగాణ టైగర్స్ యువజన సంఘం వారు ఘనంగా సన్మానించడం జరిగింది.