ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా

ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి సార్ స్ఫూర్తిదాయక ప్రసంగం

రిటైర్డ్ టీచర్ విఠల్ చేతుల మీదుగా ప్రతిభావంతులకు నగదు బహుమతులు

విద్యార్థుల నృత్యాలు, పాటలతో సందడి వాతావరణం

గ్రామ ప్రముఖులు, అధ్యాపకులు, విద్యార్థుల సమగ్ర హాజరు

బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15

బీర్కూర్ మండలంలోని మున్నూరుకాపు సంగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ — “క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజూ కళాశాలకు హాజరై, అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటే మంచి ఫలితాలు సాధించి, కళాశాలకు పేరు తీసుకురాగలరు,” అని అన్నారు.

తదనంతరం రిటైర్డ్ టీచర్ విఠల్ గత సంవత్సరం MPC, BiPC, CEC గ్రూపుల్లో ప్రథమ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతీ ఒక్కరికీ ₹1000 నగదు బహుమతిగా అందజేశారు.

విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్యాలు, పాటలతో వేదికను కళకళలాడించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు , బస్వరాజు సొసైటీ ఛైర్మన్ ఇంగు రాములు , అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ పద్మ అవారి గంగారాం , అలాగే అధ్యాపకులు చంద్రశేఖర్, సత్తాన్న, రంజిత్, దేవి సింగ్, నారా గౌడ్, సతీష్, సౌమ్య, సుభాష్, బాలకిషన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం స్నేహభావం, స్ఫూర్తి, వినోదం మేళవింపుగా సాగి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment