గానుగుపహాడ్ చీటకోడూర్ వంతెనలను త్వరితగతిన నిర్మించాలి.
టీజేయు జనగామ జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 04
జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు గానుపహాడ్ చిటకోడూర్ వంతెన సాధన సమితి, ఆధ్వర్యంలో సోమవారం రోజున ఎనిమిదవ రోజు సాధన సమితి, అధ్యక్షులు యాసారపు కర్ణాకర్ ప్రధాన కార్యదర్శి ఏనుగు సిద్ధులు, ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు రిలే నిరాహార దీక్షలు, కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా కమిటీ మద్దతు తెలుపుతూ, కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూస రమేష్ యాదవ్, మాట్లాడుతూ జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుందని ప్రజలు ప్రతి అవసరానికి జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్తూ ఉంటారని కరీంనగర్ వెళ్లే ప్రజలు కూడా ఉప్పల్,ఘట్కేసర్ వాసులు దాదాపు ఈ మార్గం నుండే ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు నిత్యం సరుకు రవాణా కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి వంతెన నిర్మాణం శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు స్పందించడం లేదు దీనివలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని చిటకోడూరు వంతెన కూడా వెంటనే నిర్మాణం చేపట్టాలని, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టి జే యు) డిమాండ్ చేస్తూ, దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ ఉమెన్స్ వింగ్స్ చైర్మన్, డి. నవ్య, లలిత జనగామ హ్యూమన్ రైట్స్ చైర్మన్,బానోత్ అరుణ్ కుమార్, వైస్ చైర్మన్ రమావత్ తిరుపతి, ఆర్టిఐ చైర్మన్ బాల్ దే ఉమాపతి, కన్జ్యూమర్ చైర్మన్ బి రాజు, ఏ సతీష్, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్, కోశాధికారి నవీన్ చారి, సహాయ కార్యదర్శి అప్రోజు, మరియు తదితరులు సంఘీభావం తెలిపారు.