ప్రభుత్వ భూమి భూ అక్రమదారుల ఆటలు చెల్లవ్

*ప్రభుత్వ భూమి భూ అక్రమణదారుల ఆటలు చెల్లవు*
*జమ్మికుంట పట్టణంలో హైడ్రా లాగా ఏర్పాటుకు ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకపోతాం*

*జమ్మికుంట పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 25*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల పరిరక్షణకు మా వంతు కృషి చేస్తామని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో గత బి ఆర్ ఎస్ పాలనలో కోట్లాది రూపాయల ప్రభుత్వ పేదల భూములు యదేచ్చగా కబ్జాకు గురయ్యాయని తెలుపుతున్నామని హైదరాబాదులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా లాగా జమ్మికుంట పట్టణంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రులను కోరుతామని జమ్మికుంట కు సంబంధించిన చెరువులు కుంటలు కబ్జా అయ్యాయని భూకబ్జాదారులు ఇండ్లు అక్రమ కట్టడాల నిర్మాణదారులు ఇందుకు సహకరించిన ప్రజా ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తామని ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తే ఆట కట్టిస్తామని పేర్కొన్నారు నేడు ప్రభుత్వ ఆదేశాలతో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పేదల పాలిట నిజాయితీగా పని చేస్తే ప్రజల మన్ననలు పొందుతూ పేదలకు న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని పూదరి రేణుక శివకుమార్ గౌడ్ అన్నారు తద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు మా వంతు కృషి చేస్తామని హైడ్రాలాగా జమ్మికుంట పట్టణంలో కూడా వ్యవస్థను వివిధ శాఖల అధికారులతో పాటు పోలీస్ అధికారులతో కలిసి ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా చేస్తామని ప్రభుత్వ భూములు కబ్జా చేయాలంటే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామని పేదల భూములను లాక్కున్న వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని పేదలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు

Join WhatsApp

Join Now