నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా

నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా పనిచేయాలి

కోలా లక్ష్మీనారాయణ

సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి

IMG 20241109 WA0098

*సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, ముచ్చర్ల గ్రామంలో అమరవీరుల వారోత్సవాలలో భాగంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా కామేపల్లి సబ్ డివిజన్ నాయకులు కోలా అప్పారావు కష్టజీవుల జెండా ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు.* భూమికోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంధా మార్గంలో పనిచేసి అనేకమంది అమరులయ్యారన్నారు. ఆనాటి చండ్రపుల్లారెడ్డి దగ్గర నుండి పోట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, దొరన్న, బాటన్న, కోటన్న, ఎల్లన్న, రవన్న, కాచనపల్లి అమరవీరులు, ముసిమి అమరవీరులు నిన్నటి లింగన్న వరకు అనేకమంది భారత సమాజం వర్గాలు లేని సమ సమాజంగా ఏర్పాటు చేయడం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా పనిచేసి తమ అమూల్యమైన జీవితాలను ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో పొట్లపల్లి శ్రీశైలం, కేతబోయిన రాధాకృష్ణ, కామేపల్లి మండలంలో కామ చుక్కయ్య ఇలా అనేకమంది ప్రజా ఉద్యమంలో పనిచేస్తూ తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. అమరవీరులందరిని స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు ఎన్నికల నాడు అనేక ఉచిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలను దోపిడీ చేసే విధానాలను తీసుకవస్తున్నారన్నారు. దేశంలో ప్రజలందరికీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పనిచేయడానికి పని, చదువుకోవడానికి విద్యా అవకాశాలు, చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, దున్నేవారికి భూమి, రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర తదితర మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వాలను, పాలకులను డిమాండ్ చేస్తూ తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని, ఈ వ్యవస్థ మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కామేపల్లి సబ్ డివిజన్ నాయకులు కోలా అప్పారావు, కోలా దర్గయ్య, లింగయ్య, వెంకటేశ్వర్లు, కాసిం తదితరులు పాల్గొన్నారు.

 

విప్లవాభివందనాలతో

*కోలా దర్గయ్య*

*సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ*

*ముచ్చర్ల గ్రామ నాయకులు*

Join WhatsApp

Join Now