లక్ష్యసాధనతోనే బంగారు భవిష్యత్తు – అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

లక్ష్యసాధనతోనే బంగారు భవిష్యత్తు – అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 12

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా విద్యార్థులకు స్ఫూర్తిదాయక సూచనలు చేశారు. మంగళవారం మేడ్చల్ మండలం కిష్టాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీని ఆమె ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, “మీ కలలను నిజం చేసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. లక్ష్యాలను ఏర్పరచుకొని, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవండి” అని సూచించారు. విద్యార్థుల సబ్జెక్టులపై తెలుసుకొని, అవసరమైన మార్గనిర్దేశం చేశారు.

విద్యార్థులు కంప్యూటర్లు, ల్యాబ్ కావాలని కోరగా, అదనపు కలెక్టర్ తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మరమ్మత్తుల అవసరం వంటి అంశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, స్నాక్స్ అందుతున్నాయా అని కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now