రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేసిన ప్రభుత్వం

*రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేసిన ప్రభుత్వం*        7.8 కోట్ల రూపాయలు మంజూరు 

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రామారావు పటేల్

*నిర్మల్  జనవరి 27

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి 7కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తానూర్ మండలంలో తానూరు నుంచి హుండా వరకు రోడ్డు నిర్మాణం కోసం 5కోట్ల 90 లక్షల రూపాయల నిధులు, కుంటాల మండలం లో కుంటాల నుంచి దౌనెల్లి మహారాష్ట్ర సరిహద్దు వరకు 1 కోటి 90 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment