ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించిన ప్రభుత్వం

*ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించిన ప్రభుత్వం*

*పాఠశాలలు ప్రారంభం అయిన రోజే తల్లికి వందనం*

*విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం*

*ప్రతి విద్యార్ధి తల్లి పేరుతో ఒక మొక్క నాటి వాటిని పెంచాలి*

*మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ తో విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు*

*నాడు నేడుతో పాఠశాలలను మరింత దిగజార్చారు..*

*నియోజకవర్గ వ్యాప్తంగా 35 లక్షల విలువ చేసే డెస్కులు అందజేసిన ఎమ్మెల్యే*

*ప్రతి పాఠశాలకు క్రికెట్ కిట్లు అందిస్తాం*

*ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు..*

గత ఐదేళ్లలో పాఠశాలల్లో నాడు నేడు పేరుతో కనీస వసతులు కూడా కల్పించకుండా నిర్వీర్యం చేశారని, నేడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యతో పాటు సన్న బియ్యంతో మంచి భోజనం అందిస్తున్నారని *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..* రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో భాగంగా *శెట్టూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎమ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , జిల్లా ఫారెస్ట్ అధికారి విగ్నేష్ లు పాల్గొనగ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.* అక్కడే మొక్కలు నాటటం జరిగింది..ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి కోసం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారని, ప్రతి విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీట్లు లేవని చెప్పే రోజులు వస్తాయని అందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.. ప్రతి విద్యార్థి కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు.. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట పాఠశాలలకు 35 లక్షల రూపాయల విలువ చేసే డెస్కులను తెప్పించగా అందులో శెట్టూరు ఉన్నత పాకఠశాలకు 175 డెస్కులు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారంలో ఒక రోజు పూర్తిగా క్రీడల కోసం కేటాయించారని అందుకోసం ఆగష్టులో ప్రతి పాఠశాలకు రెండు క్రికెట్ కిట్లు అందిస్తామని చెప్పారు..

 

Join WhatsApp

Join Now