*ఏపీలో స్కూళ్ల పై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం*
ఏపీలో ఇక పై నుంచి రెండు రకాల ప్రాధమిక పాఠశాలలు*
అమరావతి :
ఏపీలో 2025-26 నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60 మంది కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్ మరియు ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది.
బేసిక్ లో 20 మంది లోపు పిల్లలుంటే ఒక SGT, అలాగే 60 మందికి ఇద్దరు SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ పాఠశాల్లో ప్రతి తరగతికి ఒక SGTనికేటాయిస్తుంది.