తెలంగాణలో ఉన్నవారిని ఆంధ్ర వారిగా చిత్రీకరిస్తున్న అధికార యంత్రాంగం
అన్ని పథకాలు తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న వారు ఎలా ఆంధ్ర ప్రజలు అవుతారు
అధికారుల అవగాహన లోపం వల్ల లబోదిబోమంటున్న తెలంగాణ కుటుంబాలు
బే షరతుగా అందరికీ కుటుంబ సర్వే చేపట్టాలి బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్
భద్రాచలం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే అధికారుల అవగాహన లేని నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని .
బే షరతుగా ప్రజలందరికీ కుటుంబ సర్వే చేయాలని భద్రాచలం మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.
భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీ 19 వార్డులో గత 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని పథకాలు .అన్ని రకాల కార్డులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. తెలంగాణలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డులు. తెలంగాణలో ఓటరు గా ఉన్న తెలంగాణలో గృహ జ్యోతి పథకం అమలు అవుతున్నప్పటికీ వీరు తెలంగాణ వాళ్లు కాదు అనే ఉద్దేశంతో అధికారులు ఆంధ్ర వారిగా చిత్రీకరించి కుటుంబ సర్వే చేయకపోవడం వల్ల ప్రజలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని
అదేవిధంగా అప్పటి అధికారులు అట్టి కుటుంబాల ఇంటి వెనక కాలువ తవ్వి అట్టి కాలువ గట్టు నుంచి ఆంధ్ర అని అప్పటి అధికారులు గుర్తించి.. వీరు తెలంగాణ వారని ఆంధ్ర అధికారులుచెప్పడం జరిగిందని. ఇప్పుడు తెలంగాణ అధికారులు వీరు ఆంధ్రా వారు అని చెప్పటం వల్ల ప్రజలు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితి లో ఉన్నారని తక్షణం అధికారులు ఆలోచించి వాటిని న్యాయం చేయాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీగా వారికి ప్రజల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ 19 వ వార్డు నాయకులు రాజుదేవర నాగరాజు. గుంజ ఏడుకొండలు. బత్తుల నరసింహులు. మండల నాయకులు అయినాల రామకృష్ణ. కాలనీవాసులు ఉన్నారు.