Site icon PRASHNA AYUDHAM

న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం రక్షణ చట్టాలని ఆమోదించాలి..

IMG 20250325 WA0034

న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం రక్షణ చట్టాలని ఆమోదించాలి..

లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి

ప్రశ్న ఆయుధం గాజ్వెల్ :

హైదరాబాదులో ప్రాక్టీసింగ్ న్యాయవాది ఇజ్రాయిల్ నీ ఉదయమే హత్య చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం ఈ హత్యకు నీరసంగా అన్ని కోర్టులలో న్యాయవాదులు నిధులను బహిష్కరించి న్యాయవాదులకు రక్షణ చట్టాలు కావాలని నిరసన తెలియజేస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి వివిధ బార్ అసోసియేషన్ లో జరిగిన నిరసన కార్యక్రమం లో పాల్గొని మాట్లాడుతూ మా యొక్క పోరాటం న్యాయవాదులకు రక్షణ చట్టాలు వచ్చేవరకు ఉంటుందని తెలియజేశారు వృత్తి నిర్వహణలో తన క్లైంట్స్ కు సలహాలు ఇస్తే కక్షతో హత్య చేస్తున్న వ్యక్తులు ఉన్న సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఉండాలన్నారు న్యాయమూర్తుల పైన న్యాయవాదుల పైన జరిగేటటువంటి దాడులపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించి రక్షణ చట్టాలు ఏర్పడవలసినటువంటి ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, గురువయ్య గౌడ్ దయ్యాల మాణిక్ రావు , బర్కా రాకేష్, బీరయ్య , జంగయ్య,అనేక మంది జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు

Exit mobile version