*ప్రభుత్వ పాఠశాలల విలీనంను ప్రభుత్వం మానుకోవాలి*
*డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి రాజిరెడ్డి*
*జమ్మికుంట జూన్ 9 ప్రశ్న ఆయుధం*
ప్రభుత్వ పాఠశాలల విలీనం ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి రాజిరెడ్డి అన్నారు. సోమవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రoలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో డీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు వేణుమాధవ్ అధ్యక్షతన సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వుల మీద అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో పాఠశాల నిర్వహణపై రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘుశంకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి రాజిరెడ్డి మాట్లాడుతూ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వుల మీద సంపూర్ణ అవగాహన కల్పించారు అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే పాఠశాలలను కుదించాలనే కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది నిరుపేద ఎస్.సి, ఎస్.టి , బలహీన వర్గాలకు చెందిన పిల్లలని వారికి సమానమైన, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని అందుకోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఐదు తరగతులతో పాటు ఐదుగురు టీచర్లను నిరమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి, ప్రధాన కార్యదర్శి రాంమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శులు తిరుపతి, చక్రధర్, జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ , ఇల్లందకుంట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంపత్, వేణు, రాగిణి, లహరి అనూష , ప్రవీణ, హరీష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.