మాదిగల డప్పుల మహా ప్రదర్శనతో ప్రభుత్వం దిగి రావాలి

*మాదిగల డప్పుల మహా ప్రదర్శనతో ప్రభుత్వం దిగి రావాలి*

*కావలి గణేష్ మాదిగ మాజీ సర్పంచ్ దుండిగల్*

*లక్షల డప్పులు,వేల గొంతుకలను జయప్రదం చేయండి*

*ముక్కెర్ల లాలయ్య మాదిగ ఎం జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు*

*మనమెంతో మన వాటా అంత పంచుకుందాం* *కుంటి నాగరాజ్ మాదిగ దుండిగల్ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్*

*ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా డప్పును సంకకేసుకుని తరలి రావాలి*

*ఆనంద్ మాదిగ దుండిగల్ 5వ వార్డు కౌన్సిలర్*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 03:కుత్బుల్లాపూర్*                                         ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 7 న,ఎల్బీ స్టేడియం వద్ద జరిగే లక్ష డప్పులు.. వేల గొంతుకల ప్రదర్శన లో మాదిగలు.. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న యావత్ ప్రజానీకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేలా దిగ్విజయం చేయాలని దుండిగల్ దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు దుడ్డు రాహుల్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం దుండిగల్ గ్రామంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ న్యాయమైన ఎస్సీ వర్గీకరణపై 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ను కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఈనెల 7న నగరంలో జరిగే మహా పదర్శనకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. అంతకు ముందు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ డప్పు రామస్వామి, ఎం జె ఎఫ్ నాయకులు ముక్కర్ల లాలయ్య మాదిగ, డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు మేకల నరసింహ, మహిళ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అంజలి, మేడ్చల్ జిల్లా ఎం జె ఎఫ్. కన్వీనర్ జోగు వెంకట్ మాదిగ, బుడ్డోల అశోక్ మాదిగ, వీరేష్ మాదిగ, సత్యనారాయణ మాదిగ, బిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment