*ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి*
*తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాములు*
*జమ్మికుంట ఏప్రిల్ 13 ప్రశ్న ఆయుధం*
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో ఆయన మాట్లాడుతూ కోతలు ప్రారంభించి 15 రోజులు కావస్తున్న ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వలన రైతులు వ్యవసాయ మార్కెట్ కు తీసుకువస్తే ఇక్కడ కనీస మౌలిక వసతులు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పండించిన పంట ఊర్లలో స్థలాలు లేకపోవడం వలన దళారులు కొనుగోలు చేయడం వలన రైతులు నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి కొనుగోలు సెంటర్లలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు చెయ్యాలనీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కనుక ముందు జాగ్రత్తగా రైతులకు తార్ పిన్ పరదాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.