*కొండపోచమ్మ కాలువ నిర్మాణం తో భూ నిర్వాసిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి*
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
కొండపోచమ్మ కాలువ నిర్మాణం తో భూములు కోల్పోతున్న రైతులకు సరైన న్యాయం చేయకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం డిమాండ్ చేశారు. కొండపోచమ్మ కాలువ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారానికి 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోల్పోతున్న రైతులు 15 రోజుల నుండి దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గుచేటు అన్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీక్షను విరమింప చేసే విధంగా చూడాలని ఆయన అన్నారు. దీనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో CPM డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు, నరేష్, దాసు, కిష్టగౌడ్, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు