ఐ ఎఫ్ టు యు విజ్ఞప్తి సతీష్ మృతి పట్ల తీవ్ర సంతాపం
సతీష్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన తోటి గార్డులు
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సోలార్ పవర్ ప్లాంట్ లో ఇలియోజ్ సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తాండ్ర సతీష్ (36)డెంగ్యూ జ్వరంతో ఆకస్మిక మృతి పట్ల ఏరియా ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నా సర్ పాషా, అంగోత్ మంగీలాల్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో చురుకైన సతీష్ అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే వాడని ఊహించని డెంగ్యూ జ్వరంతో తను మృత్యువాత పడ్డాడని సతీష్ మృతితో దిక్కులేని వారైనా తన కుటుంబాన్ని సెక్యూరిటీ ఏజెన్సీ మరియు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఐ ఎఫ్ టి యు అనుబంధ సోలార్ సెక్యూరిటీ గార్డులు చల్ల కాంతారావు ఆధ్వర్యంలో గార్డులు సతీష్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. సోలార్ పవర్ ప్లాంట్ అధికారులు కూడా సతీష్ భౌతికని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.సతీష్ మృతి ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఇలియోజ పవర్ సెక్యూరిటీ గార్డ్స్ చల్లా కాంతారావు, డి దేవేందర్, పి వీరస్వామి, బత్తుల చంద్రం ,ఎం కృష్ణ, పి శ్రీనివాసరావు ,ఆర్ శ్రీకాంత్ ,జి ప్రేమ్ కుమార్, టెక్నీషియన్స్ ఐ.సతీష్, ఈశ్వర్, సాయి, ఇలియాజ్ సిద్ధార్థ ఏ శ్రీను, అరవింద ,హరీష్, వాషింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.