ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలి: స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పూర్ణ రవిచారి

నర్సాపూర్, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వర్ణకారులు సంఘటితమైతేనే తమ హక్కులను సాధించుకోగలుగుతారని, ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పూర్ణ రవిచారి అన్నారు. ఆదివారం నర్సాపూర్ లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఆవరణలో పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, గిరాకీలు లేక స్వర్ణకారులు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ చారి, ఉపాధ్యక్షులు కృష్ణకుమార్, పాండురంగ చారి, బిక్షపతి చారి, వేణు చారి మాట్లాడారు. ఈ సందర్భంగా నర్సాపూర్ పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా భాస్కర్ చారి, ప్రధాన కార్యదర్శి ప్రభుచారి, ఉపాధ్యక్షుడు వినోద్, సలహాదారులు రామాచారి, నరసింహచారిలు ఎన్నికయ్యారు. వీరి చేత జిల్లా నుంచి వచ్చిన నాయకులు ప్రమాణస్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన వారిని శాలువాలతో సన్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment