*ఈత చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు*
*గాయపడిన గీత కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలి*
*ఇల్లందకుంట అక్టోబర్ 8 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామానికి చెందిన తోడేటి వేణు అనే గీతా కార్మికుడు ఈత చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.తోటి గీతా కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం తోడేటి వేణు అనే గీత కార్మికుడు రోజువారి కళ్ళు గీత వృత్తిలో భాగంగా ఈత చెట్టు ఎక్కి కళ్ళు గీచుచుండగా కాలుగుజి జారి ప్రమాదవశాత్తు కిందపడగ కాలు విరిగి తీవ్ర గాయాలు అయినట్లు వారు తెలిపారు.చికిత్స నిమిత్తము జమ్మికుంట ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వరంగల్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని నిరుపేద కుటుంబానికి చెందిన తోడేటి వేణు కు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయం మంజూరు చేసి ఆదుకోవాలని టేకుర్తి గౌడ సంఘం అధ్యక్షుడు తోడేటి రమేష్ గౌడ్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు తోడేటి జితేందర్ గౌడ్ గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని గౌడ కార్పొరేషన్ ను కోరుచున్నారు.