*విశ్వబ్రాహ్మణ సమస్యలు పరిష్కరించండి*
*ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయండి*
*డిఆర్ఓ కు వినతిపత్రం సమర్పించిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 5*
విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ డిఆర్ఓ పవన్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు వారు తమ ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని డిఆర్ఓ కు విజ్ఞప్తి చేశారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీరామోజు రవీంద్ర చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నకు పాలకవర్గం ఏర్పాటు చేసి తక్షణమే 1000 కోట్ల సాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా వృత్తి పని చేసుకునే కర్ర ఇనుము శిల్పి ఇత్తడి స్వర్ణకార వృత్తిదారుల దుకాణములకు ఉచిత విద్యుత్తు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రూ.5000/ పెన్షన్ అర్హులైన విశ్వబ్రాహ్మణ వేద పురోహితులను దేవాలయాల్లో అర్చకులుగా నియమించాలన్నారు కట్ట కోత మిషన్లకు ఉచిత పర్మిషన్లు శిల్పులకు శిలను తెచ్చుకోవడానికి పర్మిషన్ స్వర్ణకారుల దొంగ బంగారు రికవరికి సంబంధించిన చట్టంలో మార్పు కోసం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు గుండోజు లక్ష్మయ్య శేకల్ల హరిచారి రాష్ట్ర కార్యదర్శి ఊకంటి ఓంకార్ గంగిపల్లి ఎంపీటీసీ రంగు భాస్కరాచార్యులు నగర కన్వీనర్ తిప్పారపు శ్రీనివాస్ జిల్లా కో-కన్వీనర్స్ కొత్తపల్లి బ్రహ్మచారి కనపర్తి సత్యనారాయణ నాగసముద్రం శ్రీనివాస్ గాలి పెళ్లి రమేష్ మానకొండూరు మండల అధ్యక్షులు నందగిరి బలరాం కొత్తపల్లి మండల అధ్యక్షులు రవీంద్ర చారి పట్టణ కో కన్వీనర్ కళికోట మోహన్ కడార్ల సునిల్ దుర్సెట్టి కృష్ణ ధరణి యూట్యూబ్ ఛానల్ అధినేత శ్రీమంతుల సదాశ్రీ తదితరులు పాల్గొన్నారు.