వడ్డెర వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
– తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ, బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓబన్న జయంతినీ ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు. తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు జిల్లా నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు నర్సింలు, రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నానీ, అనంతరం వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు వడ్డెర వృత్తిదారుల సంఘం జెండా ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి సాయిలు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్ హాజరై వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారుల ఫెడరేషన్ కు 5000 కోట్లు కేటాయించి కుటుంబాలను అభివృద్ధి చేయాలని, భూమిలేని నిరుపేదలకు ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని, ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, జిల్లాలో ఉన్న క్వారీలను వడ్డెర వృత్తి దారులకు కేటాయించాలని, పెన్షన్ ఇవ్వాలని 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు అందరికీ పెన్షన్ ఇవ్వాలని వడ్డెర సొసైటీలో ఉన్న ఒక్కొక్కరికి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు పనుల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎలాంటి ఈఎండి లేకుండా ఐదు కోట్ల వరకు పనులు ఇవ్వాలని, సంఘాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడగొట్టి సాయిలు. చేతి వృత్తి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, ( సిఐటియు ) జిల్లా నాయకులు రాజనర్సు, సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు, జిల్లా కార్యదర్శి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కొమరయ్య, ఉప్పు రమేష్, పరుశురాం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11