Site icon PRASHNA AYUDHAM

ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Picsart 25 07 06 22 12 04 319

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["picsart"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"border":1,"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం 

రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద

ప్రశ్న ఆయుధం,జూలై 6, 2025:రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో గల పౌరసరఫరాల శాఖ గోదాములో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన ప్రజాపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, సొంత స్థలం కలిగి ఉండి అర్హత గల వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేసి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు అందించడం జరుగుతుందని, చెన్నూర్ నియోజకవర్గంలో 12 వేల దరఖాస్తులు రాగా అర్హులందరికీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియా పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, నీటి కరువు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి బోర్ వెల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, ఈ క్రమంలో కోటపల్లి ప్రాంతానికి 5 బస్సులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడంతో మరిన్ని రకముల వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గంలోని సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం జరిగిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్, ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 3 నెలలకు సరిపడా సన్నబయ్యం ను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు జమచేసి పెట్టుబడి సాయం అందించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సి.సి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం 423 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కోటపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 లక్షల రూపాయల సి. ఎస్. ఆర్. (ఎస్. సి. సి. ఎల్.) 2024- 25 నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. వన మహోత్సవం- 2025 కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేసి పూర్తి స్థాయిలో సాధించాలని తెలిపారు. అనంతరం చెన్నూరు మండల కేంద్రంలోని చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి హాజరై 44 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల వైశాల్యంలో మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలని, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను సద్వినియోగం చేసుకొని నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. మార్కౌట్, బేస్మెంట్, లెంటల్, స్లాబ్ ఇతర నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా పైప్ లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల ఏర్పాటు, నిర్వహణ అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చెన్నూర్ ప్రాంతానికి మంజూరు అయిన 4 ఆర్. టి. సి. బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం అధికారుల సమన్వయంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version