ఖరీఫ్ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 07:
ఖరీఫ్ 2024-25 కాలానికి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లులు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొనుగోలు కేంద్రాల వచ్చే ధాన్యం ను ఏరోజు కారోజు మిల్లులకు తరలించాలని అన్నారు. తరలించిన ధాన్యం వివరాలను (Opms) ఆన్ లైన్ ప్రోక్యూర్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో వెంటనే నమోదు చేసి 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. దొడ్డు, సన్న రకం ధాన్యం వేరు వేరుగా నిల్వ చేయాలని అన్నారు. పెండింగులో ఉన్న సిఎంఆర్ బకాయిలను త్వరితగతిన పూర్తి చేయాలని, లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, రైస్ మిల్లులు సంఘం లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు పప్పుల రాజేందర్, కార్యదర్శి కె. సంతోష్ కుమార్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
.