Site icon PRASHNA AYUDHAM

ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు

IMG 20251218 WA0041

ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు

ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు కలెక్టర్ అభినందనలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18 

కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసినందుకు ఆయన అభినందనలు తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపిడీఓలు, ఎన్నికల సిబ్బంది కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలని అధికారులను ఆయన కోరారు.

Exit mobile version