భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పలు వీధుల్లో డ్రైనేజీ కాలువలు పూడికలు తీయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వీటిని గమనించిన గ్రామపంచాయతీ అధికారులు డ్రైనేజీ పూడికలు తీస్తున్నారు. అది అభినందనీయమే కానీ డ్రైనేజీల్లో వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండటం వల్ల దోమలు ఇతర హానికర కీటకాలు కు నివాసంగా మారింది. దోమల దోమల లార్వాలు కీటకాలు డ్రైనేజీల్లో ఉండి ప్రతి వీధిలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటివల్ల ఎందరో అనారోగ్యానికి గురయ్యారు గ్రామపంచాయతీ అధికారులు డ్రైనేజీ పూడిక తీయించడంతోపాటు దోమలను అరికట్టడంలో కూడా కాస్త శ్రద్ధ వహించాలని భద్రాచలం గ్రామస్తులు కోరారు.కుదిరితే డ్రైనేజీ కూడిక తీయించే ముందు దోమల లార్వాలను చంపే పని కిరోసిన్ పోయటం, ఇతర ఇతర మందులు వేసి చని పోయిన తర్వాత పూడికలు తీస్తే బాగుంటుంది అని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామపంచాయతీ విధి డ్రైనేజీ క్లీన్ చేయడమే కాదు దోమల నివారణ కూడా చేపట్టాలి
