Site icon PRASHNA AYUDHAM

పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి సంప్రదాయంబతుకమ్మ

*IMG 20241011 WA41271

 

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే కూనంనేని, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. గురువారం సాయంత్రం కొత్తగూడెం మహిళల ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి పాల్గొన్న నాగా సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమంతా గ్రామ గ్రామాన అక్క చెల్లెలు సంబరంగా నిర్వహించుకునే పూల పండగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సామాజిక సంబురం ఈ పండగ అని కొనియాడారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం మన తెలంగాణకే దక్కిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందనీ స్పష్టం చేశారు. 

మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఆ గౌరీ మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిరవిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version