ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఆటో జేఏసీ అధ్యక్షుడు బోధసు నరసింహులు

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కామారెడ్డి ఆటో జేఏసీ అధ్యక్షుడు బోధసు నరసింహులు అన్నారు. కామారెడ్డి జిల్లా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆటోల వివక్షను విడనాడాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని పునసమీక్షించాలని, ఆటోవాలాల కడుపు కొట్టొద్దని, ఆటో కార్మికుల ఉపాధిని దూరం చేయొద్దన్నారు. ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయకుంటే మండల స్థాయిలో నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమం చేయడానికి ఆటో కార్మికులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అవసరమైతే నిరవధిక దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఆటో వాళ్ళని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఆటో జేఏసీ అధ్యక్షులు బోదాసు నరసింహులు, జిల్లా కార్యదర్శి కుర్లం రాజశేఖర్, జిల్లా కోశాధికారి అరే కృష్ణ సభ్యులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now