పిసిసి అధ్యక్షుడికి ‘గల్ఫ్ గాయం ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు’ పుస్తకం అందజేత
డాక్టర్ షేక్ చాంద్ పాషాను అభినందించిన మహేష్ కుమార్ గౌడ్
గల్ఫ్ రిటర్న్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త, టీ.పి.సి.సిప్రతినిధి, సమాజ సేవకులు, ఎన్.ఆర్.ఐ.సెల్. కన్వీనర్, డాక్టర్ ఫేక్ చాంద్ పాషా శుక్రవారం రోజున హైదరాబాద్ తరలి వెళ్లి, తెలంగాణ రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిసి, తను రచించిన ఆటోబయోగ్రఫీ, గల్ఫ్ గాయం ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు అనే పుస్తకాన్ని పీసీసీ అధ్యక్షులకు అందజేశారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులను, నకిలీ ఏజెంట్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో, తన పుస్తకంలో వివరించానని, గల్ఫ్ లో జైల్లో మగ్గి అక్కడే మృతి చెందిన వందలాది మంది కార్మికుల మృతదేహాలను స్వగ్రామాలను తరలించానని, తన స్వీయ అనుభవం తో గల్ఫ్ గాయం, ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు అనే పుస్తకాన్ని రచించి, ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందని, పిసిసి అధ్యక్షులకు డాక్టర్ షేక్ చాంద్ పాషా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ చాంద్ పాషాను రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. డాక్టర్ చాంద్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐ బోర్డు ఏర్పాటు చేయాలని, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను, ఆదుకునేందుకు ఐదు లక్షలు మంజూరు చేయాలనే, ఆకాంక్ష, డిమాండ్లు నేటికీ నెరవేరిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడంలో, సీఎం రేవంత్ రెడ్డితో పాటు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కృషి ఎంతో ఉందని డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. గల్ఫ్ బాధితుల తరఫున గతంలో పోరాటం చేసి, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను, ఆదుకునేందుకు లక్ష పరిహారం అందేలా కృషి చేశానని పిసిసి అధ్యక్షులకు గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని తన డిమాండ్ ను సీఎం రేవంత్ రెడ్డిఅమలు చేసి నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో గల్ఫ్ వెళ్ళే కార్మికుల కుటుంబాలను, నకిలీ ఏజెంట్ల బారిన పడవద్దని,వందలాది అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్య పరచడం జరిగిందని పిసిసి రాష్ట్ర అధ్యక్షులకు డాక్టర్ షేక్ చాంద్ పాషా వివరించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారంతోపాటు, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను, ఆదుకునేందుకు ఐదు లక్షల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలను, ఉపాధి కోసం వలస వెళ్లిన అన్ని దేశాల్లోన్నీ కార్మిక కుటుంబాలకు అందజేయాలని డాక్టర్ షేక్ చాంద్ పాషా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిని కోరారు.