పేద విద్యార్థి ప్రాణానికి మీరు చేయగలిగిన సహాయం వెలకట్టలేనిది
అశ్వారావుపేట పేరాయిగూడెం పంచాయితి నెహ్రూనగర్‌కు చెందిన 16 ఏళ్ల మొ య్యేటి చరణ్, ప్రతిభావంతుడైన విద్యార్థి. సత్తుపల్లిలోని తేజ ఒకేషనల్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలతో అతను తీవ్రంగా బాధపడుతున్నాడు—రక్త తగ్గడం, తెల్ల రక్త కణాలు విరిగిపోవడం, గుండెకు చిల్లు వంటి సమస్యలు అతని ఆరోగ్యం క్షీణింపజేశాయి. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో, చరణ్ వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ కి తరలించబడ్డాడు. వైద్య నిపుణుల వివరాల ప్రకారం, చికిత్స కోసం సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని తెలుసుకున్న స్థానికులు, స్నేహితులు కొంత ఆర్థిక సహాయం అందించారు. అయితే, మరింత వైద్య సహాయం అవసరం ఉండడంతో, సర్వతా దాతలు ముందుకు వచ్చి ఈ నిరుపేద విద్యార్థి ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. చరణ్ తండ్రి జయరాం, ఒక సాధారణ కూలీ, వైద్యం ఖర్చులు భరించేందుకు తగిన సొమ్ము లేక, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చరణ్‌ను కాపాడేందుకు దాతల సహాయం అత్యవసరం. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలుడి జీవితానికి మీరు చేయగలిగిన సహాయం ఎంతో విలువైనది. మీ చిన్న విరాళం అతనికి కొత్త ఆశను, జీవితం తెచ్చిపెట్టగలదు. సహాయం చేయదలచిన వారు, ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా 6302609114 ఈ నెంబర్ కి తమ విరాళాలు పంపించగలరు