మందాడి! ఆ మందకు మోసం చేసి? ఈ మందలో చేరావు!!!

దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మందడి శ్రీనివాసరావుకు సవాల్ విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30: కూకట్‌పల్లి ప్రతినిధి

మందాడి! ఆ మందకు మోసం చేసి? ఈ మందలో చేరావు!!!

అక్రమ నిర్మాణాలు చేపడుతూ అభివృద్ధిపై ప్రశ్నిస్తావా?

హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టావు

కార్పొరేటర్ గా ఉంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలు సంపాదించావు

టిడిపిలో ఉండి ఎన్టీఆర్ మనవరాలని వెన్నుపోటు పొడిచావు

లోపాయికారిగా టిఆర్ఎస్ కు ఓట్లు వేయించిన చరిత్ర కార్పొరేటర్ మందాడిది

టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ గా ఉన్నావ్

ఆనాడు అభివృద్ధిపై ఎందుకు ప్రశ్నించలేదు

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధిపై వినతి పత్రాలు ఇస్తావా?

మందడి శ్రీనివాసరావు నీవు కార్పొరేటర్ కాకముందు ఆస్తి ఎంత అయ్యాక ఎంత?

బహిరంగ చర్చకు సిద్ధమా?

అభివృద్ధిపై అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న కె.పి.హెచ్.బి(114) డివిజన్ కార్పొరేటర్ టిఆర్ఎస్ సమయంలో అభివృద్ధిపై ఎందుకు ప్రశ్నించలేదని. తమ్మినేని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలుగుదేశం కార్పొరేటర్ గా గెలుపొంది 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి సుహాసిని కి మోసం చేసింది మందడి శ్రీనివాసరావు కాదా అని ప్రశ్నించారు. లోపాయికారికంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో చేతులు కలిపి ఆమెను ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారు. దాంతో నందమూరి సుహాసిని కి సమాధానం చెప్పలేక మందడి శ్రీనివాసరావును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపించుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పిడికిటి గోపాల్ చౌదరి స్థానిక కార్పొరేటర్ గా ఉంటూ హౌసింగ్ బోర్డ్ కు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విక్రయించారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని ప్రకటనలు ఇచ్చిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రభుత్వ స్థలంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు నిర్మించిన అక్రమ నిర్మాణం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా హౌసింగ్ బోర్డ్ స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణం నిర్మించడం అంటే కంచె చేనును మేసిన చందంగా ఉందన్నారు. దమ్ముంటే మందడి శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేయలేదా? ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆక్రమణలు ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బి బ్లాకు అధ్యక్షురాలు సంధ్య ఏఎంసీ డైరెక్టర్ కోకిలగడ్డ ఫణి కుమార్ డివిజన్ అధ్యక్షురాలు రజిత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి పొన్నం సాయి తేజ మహిళ నాయకురాలు థర్డ్ ఫేస్ రేణుక మరియు ఫోర్త్ ఫేస్ రేణుక పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now