Site icon PRASHNA AYUDHAM

త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులది

IMG 20240920 WA0003

● సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమాలు చేస్తూనే ఉంటాం..

● కూనంనేని సాంబశివరావు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే

● సీపీఐ ఆధ్వర్యంలో గజ్వేల్ లో భారీ ర్యాలీ

గజ్వేల్ సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :

పోరాటాల చరిత్ర, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులదని భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని,ఆ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవగా బిజెపి పార్టీ వక్రీకరిస్తుందని,4500 మంది కమ్యూనిస్ట్ అమరుల రక్తతర్పణంతో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
శుక్రవారం రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవాల సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అధ్యక్షతన గజ్వేల్ లోని కోలా అభిరాం గార్డెన్ లో వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బ్రిటిష్ ముష్కరుల పాలన నుండి భారతదేశానికి ఆగస్టు 15 ,1947 న స్వాతంత్య్రం వచ్చిన తెలంగాణను నిజాం నవాబు తమ ఆధీనంలో పెట్టుకుని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా పాలన సాగిస్తూ దొరలు,దేశముఖ్ లు,జమిందార్ లు,జాగిర్ధార్ లను,రజాకార్ల తో తెలంగాణ ప్రజలను పన్నుల రూపాల్లో, చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో బద్ధం ఎల్లారెడ్డి,రావి నారాయణ రెడ్డి,మాక్ధూమ్ మోహినోద్ధిను,అనభేరి ప్రభాకర్ రావు తదితర కమ్యూనిస్ట్ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు పిలుపునిచ్చి ప్రజల చేత బందుకులు పట్టించి నిజాం పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం బీకర పోరాటం నిర్వహించారన్నారు. దున్నే వాడికి భూమి ఇవ్వాలని 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత సీపీఐ పార్టీది అని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో 4500 మంది అమరుల ప్రాణత్యాగంతో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కొన్ని పార్టీలు ఈ చరిత్ర ను వక్రీకరిస్తున్నాయని,హిందూ ముస్లిం ల గోడవగా,వల్లభాయ్ పటేల్ సైనిక చర్య తో భారత దేశంలో హైదరాబాద్ ను విలీనం చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులను స్మరించుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు పాలక ప్రభుత్వాల విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రావు,దయానంద రెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్,కిష్టపురం లక్ష్మణ్,అందే అశోక్,జిల్లా నాయకులు స్వర్గం రాజేశం,చింత శ్రీను,నర్సింహారెడ్డి,మల్లారెడ్డి,మూన్వర్ జాన్,పద్మ,రజిని,మమత,కొయ్యడ కొమురయ్య,మంద శ్రీను,రూపేష్,సుధాకర్,ఏఐఎస్ఎఫ్ నాయకులు జేరిపోతుల జనార్దన్,సంగెం మధు,రామగాళ్ల నరేష్,వేల్పుల ప్రసన్నకుమార్,కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version