లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కామారెడ్డి టౌన్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో అన్మన్నెడ్,ఆర్టీషన్స్, జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ ఐ, ఎస్ఎల్ఐ, ఎఫ్ఎం లను ఘనంగా సన్మానించడం జరిగిందని కామారెడ్డి విద్యుత్ సూపరిండెంట్ ఇంజనీర్ నీల శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో అన్మన్నెడ్,ఆర్టీషన్స్, జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ ఐ, ఎస్ఎల్ఐ, ఎఫ్ఎం లు సంస్థాభివృద్ధికి అందిస్తున్న అపరిమిత సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో వారికి మరిన్ని అవకాశాలు అందించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అహర్నిశలు కష్టపడే ఈ కార్యదక్షుల సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, లైన్మెన్‌లు తమ అనుభవాలను పంచుకుని, సంస్థ పురోగమించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) ప్రభాకర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కిరణ్ చైతన్య, అలాగే ఏఈ లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.