- మంటల్లో దగ్ధమైన 8 తులాల బంగారం,
- 25 తులాల వెండి.., రూ.3,80,000 నగదు.
- బోర్ల విలపిస్తున్న బాధితులు ప్రభుత్వం ఆదుకోలంటూ వేడుకోలు
తొగుట, 11 జనవరి 2025 : తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన నూనె మహేష్ ఇల్లు ప్రమాదవశాత్తు శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదానికి గురైంది. ఇంట్లో ఉన్న దేవునికి దీపాలు ముట్టించడంతో ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం జరిగినట్టు బాధిత కుటుంబికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. స్థానిక ప్రజలు మంటలు చల్లార్చే ప్రయత్నం చేయగా మంటలు ఆర్ప లేకపోయారు. వెంటనే గజ్వేల్ నుండి హుటా హుటినా ఫైర్ ఇంజన్ తో ఫైర్ ఇంజన్ సిబ్బందితో ఏఎల్ఎఫ్ శ్రీనివాసు లు, ఫైర్ మాన్ శివకుమార్, హోంగార్డు స్వామి, డ్రైవర్ సతీష్ లు కలిసి పూర్తి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో నిత్యవసర సరుకులు, వస్తువులు, బట్టలు, డబ్బాలో దాచుకున్న 8 తులాల బంగారం, 25 తులాల వెండి గొలుసులు, రూపాయలు 380000/- పూర్తిగా కాలిపోయాయయని బాధితులు తెలిపారు. బాధిత కుటుంబీకులు బోరున విలపిస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.