*బిజెపి లో పలువురు మహిళల చేరిక.*
*ప్రశ్న ఆయుధం జులై 13, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా ఆదివారం రోజు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో భారతి నగర్ బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో 111 డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ సభ్యులు అంజలి, అలివేలు, ఊర్మిళ, అనంతలక్ష్మి, సరస్వతి, నాగరాణి, అనసూయ, జహ్రబి, విశాల్, నవీన్ లు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. అన్ని విధాలుగా పార్టీ కి అండగా ఉంటూ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తామని కృష్ణ మూర్తి చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్ చారి, సునంద, శ్రీనివాస్ చారి, సాయి వెంకట హర్ష తదితరులు పాల్గొన్నారు.