జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
జూలూరుపాడు గత 14 ఏళ్లగా అర్ధా ఆకలితో అలమటిస్తూ అరకోర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న వసతి గృహాల విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఫలితంగానే మెస్ ఫాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గూగులోత్ వంశీ ప్రభుత్వం పెంచడం అభినందనీయమన్నారు.
మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.
3 నుంచి7, వ తరగతి విద్యార్థిని విద్యార్థులకురూ ,,950 నుంచి రూ,,1330, 8,నుంచి 10 పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు రూ,, 1100నుంచిరూ,,1540,
ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు విద్యార్థిని విద్యార్థులకురూ ,,1500 నుంచిరూ,,2100 వరకు దీనితోపాటు కాస్మోటిక్ చార్జీలు
3,నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకురూ,,55 నుండిరూ,,175 వరకు 8,నుండి 10వ తరగతి విద్యార్థులకురూ,,75 నుండి రూ,,275 వరకు
3,నుంచి 7 తరగతి విద్యార్థులకురూ,,62 నుండిరూ ,,150 వరకు 8,నుండి 10 వరకురూ,,62 నుండి రూ,,200 వరకు పెంపుదల చేయడం జరిగిందని. ఇది ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు తక్షణమే దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు వసతి గృహాల భవనాలకు మరమ్మతులు చేయించి కిటికీలు తలుపులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల
రానున్న రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుట్టునున్నట్లు. ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ , అఖిల్, విజయ,అనిల్ గణేష్ తదుపరులు పాల్గొన్నారు.