పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి

*సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు.. నేటి నుంచే అమల్లోకి…*

 

తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్‌ ధరలు పెరిగాయి. సిమెంట్‌ ధరల్ని పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని ‘ఎన్డీటీవీ ప్రాఫిట్‌’ పేర్కొంది.

 

ధరలు సవరించిన వాటిలో అల్ట్రాటెక్‌, ఇండియా సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, రామ్‌కో, ఏసీసీ, ఇండియా సిమెంట్స్‌ సహా ప్రధాన సిమెంట్‌ కంపెనీలు ఉన్నాయి.

 

ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్‌ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది. తమిళనాడులో రూ.10-20 పెంచినట్లు తెలిపింది. సవరించిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ముడిసరుకులు, పెరుగుతున్న రవాణా ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్‌ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణరంగంతో పాటు మౌలిక సదుపాయాల కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

Join WhatsApp

Join Now