Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ..మాజీ కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య 

IMG 20250517 WA0024

ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ

– 46 వ వార్డు మాజీ కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కామారెడ్డి మున్సిపల్ 46వ వార్డ్ మజీ కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మార్కౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం మన రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు, అపర భగీరథడు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషి వలన కామారెడ్డి నియోజకవర్గం లో వేలాది ఇండ్లను మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే 46 వ వార్డు ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని మర్చిపోవద్దన్నారు. అర్హులైన వారికి ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని ప్రజలు నిరాశ పడవద్దని ఇది నిరంతర ప్రక్రియ అని అర్హులైన ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో ఖాళీ స్థలం వున్నా వారికి, ఇండ్లు కూలిపోయిన, రేకుల ఇండ్లు, వికలాంగులకు, మంజూరు అయినా తర్వాత ప్లాటు కానీ పాత ఇండ్లు, ఓపెన్ ప్లాటు ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాంటిి వారికి అధికారులే వఛ్చి ప్లాటులో మార్కింగ్ ఇస్తారు అన్నారు. వార్డు ప్రజల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు.

Exit mobile version