ఇబ్రహీంపేట్ లో చేపట్టిన పనుల జాతర కార్యక్రమం
ప్రశ్న ఆయుధం 22 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ ఇంకుడు గుంతల నిర్మాణానికి అధికారులు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువులు, మేకలు, కోళ్ల షెడ్ల పెంపకం కోసం నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, పండ్ల తోటల పెంపకం చేపట్టవచ్చని ప్రజలు ఉపాధి హామీ కింద చేపట్టే పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఎంపీటీసీ మాజీ కళావతి హన్మాండ్లు మాజీ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండి సాయిలు యాదవ్ పండరి యాదవ్ నర్సాపూర్ విట్టల్ మోహన్ సాయబోయి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.