జర్నలిజం లో పీహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించి అరుదైన ఘనతను పొందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు ఇటీవల ఎల్.ఎల్.బి హానర్స్ కూడా పూర్తి చేసి హైకోర్టు అడ్వకేట్ గా ఈనెల 9వ తేదీన ఎన్రోల్మెంట్ పూర్తి చేశారు. దీంతో సూర్యాపేట చెందిన సహచర జర్నలిస్టులు, ప్రముఖ రియల్టర్, సామాజిక సేవకులు, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక జిల్లా స్టాపర్ మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, సీనియర్ జర్నలిస్ట్ బిగ్ టీవీ గుడిపూడి రామకృష్ణ గౌడ్ లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తదుపరి ముకుందాపురం గ్రామానికి చెందిన, అంచలంచెలుగా ఎదిగి ఆర్టీసీ లో సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తున్న పల్లె సుదర్శన్ డాక్టర్ కృష్ణ ను ఘనంగా సన్మానించారు. నిరక్షరాస్యులు అయినప్పటికీ విద్య విలువ తెలుసుకొని చదివించి తనకు జన్మనిచ్చిన తన తల్లిదండ్రులు బంటు బుచ్చమ్మ సైదయ్యలకు….తాను పుట్టిన ముకుందాపురం గ్రామానికి, చదువు పునాదులు వేసిన ముకుందాపురం, దాసారం ప్రాథమిక పాఠశాలలకు, రోజు పది కిలోమీటర్లు నడిచి వచ్చి విద్యను అభ్యసించిన నాగులపాటి అన్నారం ఉన్నత పాఠశాలకు గొప్ప కీర్తిని, ఘనతను డాక్టర్ కృష్ణ సాధించి పెట్టాడని కొనియాడారు. తనను సన్మానించిన అందరికీ డాక్టర్ కృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.