30 లక్షలతో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించిన నిర్మాణదాత

*స్వయంభు లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం*

*ప్రతి పేదవాడికి ఉపయోగపడేలా కళ్యాణ మండప నిర్మాణం*

*ఆలయం వద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రారంభించిన చుక్కా రంజిత్*

*ఇల్లందకుంట మార్చి 11 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం లేక తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అదే గ్రామానికి చెందిన చుక్క అరుణ రాణి రంజిత్ దంపతులు 30 లక్షల రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మించి మంగళవారం రోజున ప్రారంభించారు ఉమ్మడి జమ్మికుంట మండల మాజీ వైస్ ఎంపీపీ చుక్కా రంజిత్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమని మెరుగుపరచాలని స్వామి ఉద్దేశంతో స్వామివారి కల్యాణానికి ప్రతి పేదవాడికి ఉపయోగపడాలని దృఢ సంకల్పంతో స్వామివారిని వేడుకోవడం జరిగిందని మొక్కిన మొక్కులకు కోర్కెలు తీర్చే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కళ్యాణ మండపాన్ని నిర్మించే విధంగా ఆ స్వామివారు అనుగ్రహించి నా చేత ఈ నిర్మాణాన్ని కావించారని అన్నారు స్వయంభు లక్ష్మి నరసింహ స్వామిని కొల్చిన వెంటనే కోరికలు తీరుతాయని స్వామివారి అనుగ్రహంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా దాతల సహకారంతో తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైతామని వారు పేర్కొన్నారు ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడే ప్రతి వ్యక్తిని మా గ్రామ ప్రజలందరూ గుర్తుంచుకుంటారని ప్రభుత్వం తరఫున నిధుల సేకరణకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఉమ్మడి మండలానికి చెందిన దాతలు సహకారం అందిస్తున్నారని ఉమ్మడి మండలంలో ఏకైక స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇది ఒకటే అని సరియైన రోడ్డు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి ఆలయానికి సరియైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిట్ల చంద్రమౌళి, వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్ చిట్ల సరోజన నాగన్న, చిట్ల శ్రీనివాస్ నెల్లి శేషు, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ మాజీ చైర్మన్లు దేశి కోటి, కంకణాల సురేందర్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి మాజీ ఏఎంసీ చైర్మన్ పోలేని సత్యనారాయణరావు కన్నూరు సత్తన్న మాజీ సర్పంచ్లు కంది దిలీప్ రెడ్డి, అరుణ సదానందం, మానస మహేందర్, తిప్పర బోయిన మొగిలి, చుక్క వేణుగోపాల్, తోపాటు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment