Site icon PRASHNA AYUDHAM

ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల రాజ్యం

IMG 20250502 182232

Oplus_131072

*నోటీసులు ఇచ్చినా.. ఆగని నిర్మాణాలు..*

*అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ కు ఫిర్యాదులు*

*అటు వైపు కన్నెత్తి చూడని జిల్లా అధికారులు*

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామ పంచాయతీలో భవనాల అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చినా.. యథేచ్చగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మాణాలు చేస్తూ బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా… అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

*నోటీసులు మాత్రమే.. కూల్చివేతలు ఎక్కడ..* 

ఇంద్రేశంలోని పీఎన్ఆర్, ఆర్కే, నవ్య కాలనీల్లో అనుమతికి మించి నిర్మాణాలు జరుగుతుండటం తెలిసిందే. అయితే వాటిపై అధికారులు కేవలం నోటీసులు మాత్రమే జారీ చేస్తూ… తరువాత ఏ చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు అధికారులపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం జరిగిన తర్వాత నోటీసులిచ్చి ప్రయోజనం.. ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

*బిల్డర్లకు రాజకీయ ఆశ్రయం*

కొంతమంది బిల్డర్లు బలమైన రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై అధికారులు కూల్చివేత చర్యలు తీసే స్థాయిలో ఉండరు. పంచాయతీ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటం వల్ల వారు తమ కర్తవ్యం నిర్వహించలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

*జీ ప్లస్ టూ అనుమతులు.. ఐదు అంతస్తుల భవనాలు*

ఇంద్రేశం పరిధిలో అనుమతులు రెండు అంతస్తులకు మాత్రమే ఇవ్వబడినప్పటికీ, ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇది స్పష్టమైన చట్టవ్యతిరేక చర్య. కానీ వీటి వెనక ఉన్న బలమైన శక్తులు ఎవరు? ఎవరి అండతో ఇంత ధైర్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్థుల ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లాస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్ ను కోరుతున్నారు. ఇంద్రేశం గ్రామ పంచాయతీ అధికారుల వైఖరి ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా, కనీసం స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Exit mobile version