Site icon PRASHNA AYUDHAM

ఘనంగా ప్రధానోపాధ్యాయుడు రాజులు ఉద్యోగ విరమణ సభ

IMG 20250302 WA0434

– భారత సామాజిక నిర్మాణంలోనే అసమానతలు ఉన్నవి

– పెట్టబడిదారి ఉత్పత్తి విధానం సామాజిక సంబంధాలను ధ్వంసం చేస్తున్నది

– ఉపాధ్యాయలు మౌనంగా ఉండరాదు

– నిరంతర పోరాటమే సామాజిక క్రమాన్ని మార్చగలదు

– ప్రొఫెసర్ కాశీం

గజ్వేల్, 02 మార్చి 2025 :

టిపిటిఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సు మరియు బి.రాజులు జడ్పీహెచ్ఎస్ రిమ్మనగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఉద్యోగ  విరమణ సభలో ముఖ్యఅతిథిలుగా టిపిటిఎఫ్ రాష్ట్ర  అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి గారలు  పాల్గొన్నారు. ఈ సమావేశానికి జోన్ కన్వీనర్ జే.శ్రీనివాస్ అధ్యక్షత వహించాడు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చింతకింది కాశీం.సంక్షోభ కాలంలో మేధావుల పాత్ర అంశంపై మాట్లాడుతూ దేశంలో నేడు ప్రభుత్వాలు పాసింజం మాటున పనిచేస్తున్నాయని నియంతృత్వ  ధోరణలను ఎదిరించాల్సిన అవసరం మేధావులపై ఉన్నదని,  సంక్షోభ కాలంలో ఏటికి ఎదురీదైన మేధావులు ఎన్ని అణచివేతలు  ఎదురైనా సమాజ శ్రేయస్సుకు పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. భారతదేశం అన్ని మతాలు, కులాలతో  సమైక్యతతో కలగలిసిన ప్రజల నివాసమనిభారత దేశ ఉపాధ్యాయులు మేధావులు ప్రజల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు .ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మేధావులు ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వాలను అవసరమైనప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో టిపిటిఎఫ్ పాత్ర చాలా గణనీయమైనదని ఇక్కడి కార్యకర్తలు రాష్ట్రంలోని టిపిటిఎఫ్ కు ఆదర్శమని చెప్పారు ఉపాధ్యాయులుగా మనం పేద పిల్లల విద్య అభివృద్దికి  కృషి చేయాలని చెప్పారు. ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యను ప్రైవేటుపరం చేసే ఆలోచనలను , ప్రయత్నాలను మానుకొని ప్రభుత్వ పాఠశాలను మరింత బల పడేటట్లు కృషి  చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి  ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు ప్రకాష్ రావు ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షులు ఏ.నరసింహారెడ్డి, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రామచంద్రం,వై.అశోక్ కుమార్  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నరేందర్  జోన్ పరిధిలోని అధ్యక్షులు నాగరాజు, పర్వతం నరసయ్య ,గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్,  రాజనర్సింహ, వెంకట్ గార్లు పాల్గొన్నారు సీనియర్ నాయకులు పి ఎల్లయ్య, దమ్మన్ మల్లయ్య, శంకర్, పరమేశ్వర్, జి పెంటయ్య  తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version