యాదవ కురుమల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది

*యాదవ కురుమల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది*

*యాదవ వన సమారాధన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ భీర్ల ఐలయ్య, అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినవోలు రమేష్ యాదవ్* 

ఖమ్మం : యాదవ , కురుమల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, కాంగ్రెస్ పార్టీకివెన్నుదన్నుగా గొల్ల కురుమలు నిలిచారని,బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి, మరియు ఖమ్మం జిల్లా నుండి మేకల మల్లిబాబు యాదవ్ కు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మరియు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అఖిలభారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం యాదవ కురుమల వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేలాదిమంది గొల్ల కురుమ సోదర సోదరీమణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీర్ల ఐలయ్య మరియు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గలిగిన గొల్ల కురుమలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కలగడం లేదని, ఎంతో ఘన చరిత్ర కలిగిన కురుమ యాదవులను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వానికి జరిగిన గతే పడుతుందని, అతి తక్కువజనాభా కలిగినఅగ్రవర్ణాల వారుపదవులు అనుభవిస్తున్నారని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోతమకు ప్రాతినిధ్యం కలిగించాలనిఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో యాదవులు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారని ఇక్కడ అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ మనం ప్రభావితం చేయలేకపోతున్నామని. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క గొల్ల కురుమ పార్టీలకతీతంగా, రాజకీయాలకితీతంగా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొమురెల్లి మల్లన్న దేవస్థానం మాజీ చైర్మన్ సంపత్,సంగెo రెడ్డి సుందర్ రాజు,గొర్ల యశ్వంత్ యాదవ్, పుచ్చకాయల వీరభద్రం దుబాకుల శ్రీనివాస్,దుబాకుల వెంకటేశ్వర్లు, లోడిగ వెంకన్న, గంగదేవుల లోకేష్,వాక దాని పుల్లారావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, తెల్లబోయిన రమణ, బమ్మిడి శ్రీనివాస్, బండారు ప్రభాకర్, సత్తి వెంకన్న, పొదిల సతీష్,కనక బండి విజయలక్ష్మి, ఎనుముల రుక్మిణి,కృష్ణవేణి, గుమ్మ సైదులు మరియు తదితరులు ముఖ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment