Site icon PRASHNA AYUDHAM

ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

IMG 20250920 WA0053

ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి

 — కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

— బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం)సెప్టెంబర్ 20

 

జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించారు.

కామారెడ్డి డివిజన్‌లో కాలేశ్వరం ప్రాజెక్టు, బాన్సువాడ డివిజన్‌లో మంజీరా ఎత్తిపోతల పథకం భూసేకరణ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, “ప్రాజెక్టులకు అడ్డంకిగా మారుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భూసేకరణ వేగవంతం చేసి, భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం తక్షణమే చెల్లించేలా చూడాలి” అని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నికిత, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version